ఓదార్పు యాత్రకు వైయస్ జగన్ ఏర్పాట్లు

YS Jagan
హైదరాబాద్‌: వచ్చే నెల 8వ తేదీన ఓదార్పు యాత్ర చేపట్టేందుకే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మొగ్గు చూపుతున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను ఆయన చేసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ అధిష్టానం అనుమతితో సంబందం లేకుండా ఆయన ఈ యాత్రను చేపట్టాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. తన తండ్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఈ యాత్రను చేపట్టనున్నారు. ఈలోగా అధిష్టానం అనుమతి సాధించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రకు సిద్ధం కావాలని జగన్ జిల్లా మహిళా కాంగ్రెసు అధ్యక్షురాలు శిమ్మ ఉషారాణికి ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా మీడియాకు తెలిపింది. తాను వచ్చే నెల 8వ తేదీన చేపట్టే ఓదార్పు యాత్రకు సహకరించాలని ఆయన ఆమె కోరారు. జిల్లాకు చెందిన సమస్యలను తనకు వివరించేందుకు ఈ నెల 24వ తేదీన తనను కలవాలని కూడా ఆయన ఆమెకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+