పొన్నాల లక్ష్మయ్య ఎపిసోడ్ లో చిరంజీవి ఫ్యాక్టర్

Chiranjeevi
హైదరాబాద్: భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నాయకులు చేస్తున్న ఆరోపణల వెనక ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అంశం ఇమిడి ఉన్నట్లు భావిస్తున్నారు. జలయజ్ఞంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు ఆరోపించారు. జలయజ్ఞంలో పోలవరం ప్రాజెక్టు ప్రధానమైంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటూ చిరంజీవి ఉద్యమం చేపట్టారు. పైగా కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి చిరంజీవి దగ్గరయ్యారు కూడా. ఇటీవల ఆయన ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ను కలిసి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. ఈ స్థితిలో చిరంజీవికి పోలవరం క్రెడిట్ ఏదో మేరకు దక్కే అవకాశం ఉంది. పోలవరం డిజైన్ మార్చాలని తెలంగాణ కాంగ్రెసు సీనియర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, అది పక్కకు వెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో పొన్నాలపై ఆరోపణలు చేయడం ద్వారా దాన్ని పక్కన పెట్టే వాతావరణాన్ని కల్పించాలనేది వారి ఉద్దేశంగా కనిపిస్తోంది.

కాగా, జలయజ్ఞం విషయంలో అధికార పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తుండడంతో పొన్నాల లక్ష్మయ్య తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సీమాంధ్ర నాయకులు మద్దతు, మంత్రుల మద్దతు ఆయనకు లభిస్తున్నప్పటికీ వస్తున్న ఆరోపణల తీవ్రతను తగ్గించే పరిస్థితి లేదు. జలయజ్ఞంలో అవినీతి జరిగిందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని పాల్వాయి గోవర్దన్ రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పొన్నాల తాను చెప్పినట్లుగా సమావేశం ఏర్పాటు చేస్తే ఆధారాలను ముందు పెడతానని ఆయన చెప్పారు. ఇటు అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తుండడంతో తెలుగుదేశం, ఇతర ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వంపై దాడి చేయడానికి పదునైన ఆయుధం లభించినట్లయింది. జలయజ్ఞంలో అవినీతి చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పొన్నాలపై, రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ దాడిని ఉధృతం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+