ఓదార్పుకు జగన్ సోనియా అనుమతి పొందాలి: శైలజానాథ్

ఒకప్పుడు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని పొగిడినవారే ఇప్పుడు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామిపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై అక్కసుతో వెంకటస్వామి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వెంకటస్వామి వయస్సుకు తగినట్లు మాట్లాడితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే కాంగ్రెసును విమర్శించినట్లేనని, ఈ విషయాన్ని సోనియా దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో ఉప ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా పార్టీ పోటీ చేస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications