చాందీపూర్: భారత మధ్యశ్రేణి క్షిపణి పృథ్వీ-2 ప్రయోగం విజయవంతమైంది. ఒడిషాలోని చాందీపూర్ లోని క్షిపణి ప్రయోగకేంద్రంనుంచి ఈ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి. 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగల పృథ్వి-2కు అణ్వాయుధాలను తీసుకువెళ్లే సామర్థ్యముంది. దీన్ని పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్టు రక్షణ వర్గాలు ప్రకటించాయి.
పృథ్వి - 2ను శుక్రవారం ఉదయం సరిగ్గా 6 గంటల 50 నిమిషాలకు ప్రయోగించారు.దానికి 500 కిలోల భారం మోయగలిగే సామర్థ్యం ఉంది.