హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టు వీడని కాంగ్రెసు సీనియర్లు: కేశవరావుతో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలనే తమ డిమాండ్ పై కాంగ్రెసు తెలంగాణ సీనియర్లు తమ పట్టు వీడినట్లు లేదు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ హెచ్చరించినా వారు ముందుకే సాగాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. పోలవరం అంశం, శ్రీకృష్ణ సంఘం ముందు వినిపించాల్సిన వాదనలపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు సీడబ్ల్యూసీ సభ్యుడు కేశవరావుతో సోమవారం భేటీ అయ్యారు.

సీనియర్‌ నేతలు నర్సారెడ్డి, పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్‌, ఇంద్రసేన్‌రెడ్డి, కమలాకరరావు తదితరులు కేకేను కలిసిన వారిలో ఉన్నారు. పోలవరం డిజైన్‌ మార్పు, జలయజ్ఞం అక్రమాలపై పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీనియర్లు ఈ భేటీలో దానికి తుది రూపు నిచ్చే అవకాశాలున్నాయి. వచ్చే నెల 5,6,7 తేదీల్లో శ్రీకృష్ణ సంఘం ముందు ఉంచాల్సిన వాదనలకు సంబంధించి రూపొందించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌కు ఈ భేటీలో తుది మెరుగులు దిద్దనున్నారు. దీనితో పాటు కమిటీ ముందుకు సీమాంధ్ర నేతలతో కలసి వెళ్లాలన్న ప్రతిపాదనపై కూడా నేతలు చర్చించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X