శ్రీకాకుళం: మద్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి రోశయ్య ఘాటుగా తిప్పికొట్టారు. నిధుల కొరత కారణంగా వివిధ పథకాలకు ప్రాధాన్యపరంగా నిధులు కేటాయిస్తున్నామని రోశయ్య చెప్పారు. శ్రీకాకుళంలో పర్యటించిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం రావడం నేరమా అంటూ ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను చాటుకుంటుందని చెప్పారు.
వంశధార జల వివాదంపై ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో నేరుగా మాట్లాడతానన్నారు. బీఆర్‌జీఎఫ్ నిధుల్ని మరిన్ని జిల్లాలకు విస్తరింపజేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పారు.