తెలంగాణ పట్ల ప్రభుత్వం దుర్మారం చేస్తోంది: కె చంద్రశేఖర రావు

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ పట్ల ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ద్వంద్వ నీతిని పాటిస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. హైదరాబాదులో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి సిటీ క్యాడర్ కింద నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. హైదరాబాదు ఆరో జోనులో భాగమని, ప్రత్యేకంగా సిటీ క్యాడర్ కింద నియామకాలు సరి కాదని ఆయన అన్నారు. హైదరాబాదు ఆరో జోను కిందికి వస్తుందని ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి, ఇప్పుడు ప్రత్యేకంగా సిటీ క్యాడర్ కింద నోటిఫికేషన్ ఇవ్వడం ద్వంద్వ ప్రమాణాలు పాటించడమేనని ఆయన అన్నారు. ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసి పరీక్షను కూడా సిటీ వరకు రద్దు చేయాలని ఆయన అన్నారు. హైదరాబాదులో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి జూలై 2వ తేదీన జరిగే పరీక్షను రద్దు చేయకపోతే సంభవించే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

ఇదిలావుంటే, తెలంగాణకు చెందిన 160 మంది తహిసల్దార్లకు ప్రభుత్వం ప్రమోషన్ నిరాకరించిందని, దీనివల్ల వారు డిప్యూటీ కలెక్టర్లు కాలేకపోయారని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల అన్యాయాల పరంపర కొనసాగుతూ ఉన్నదని ఆయన విమర్సించారు. ఏయే జిల్లాలో ఎంత మందికి ప్రమోషన్ నిరాకరించారో ఆయన వివరించారు. తెలంగాణ తహిసల్దార్లకు ప్రమోషన్లు నిరాకరించి తెలంగాణేతర తహిసల్దార్లకు ప్రమోషన్లు ఇవ్వడం వల్ల తెలంగాణ తహిసల్దార్లు తమకన్నా జూనియర్ల కింద పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+