ఓదార్పు యాత్ర ఉండవచ్చునంటున్న వైయస్ జగన్ క్యాంప్

YS Jagan
హైదరాబాద్: పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ భేటీపై వస్తున్న ప్రచారం నుంచి దృష్టి మళ్లించేందుకు ఆయన క్యాంపు ప్రయత్నిస్తోంది. జగన్ ఓదార్పు యాత్ర గురించి సోనియా మాట కూడా ఎత్తలేదని, ఓదార్పు యాత్రకు అనుమతి లభించడం కష్టమేనని వస్తున్న వార్తాకథనాల నేపథ్యంలో ఆయన వర్గం నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. జగన్ ఓదార్పు యాత్రకు సోనియా గాంధీ అనుమతిస్తారని ఆశపడుతోంది. ఇందులో భాగంగానే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ప్రకటన చేశారు.

జగన్ పట్ల సోనియా సానుకూలంగానే ఉన్నారని మంగళవారం జరిగిన భేటీతో మరోసారి రుజువైందని అంబటి రాంబాబు అన్నారు. జగన్ పై చేస్తున్న దుష్ప్రచారానికి భేటీతో తెర పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. జూలై 8వ తేదీ నుంచి తలపెట్టిన వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని ఆయన అన్నారు. సీమాంధ్రలో జగన్ యాత్రకు అనుమతి ఇవ్వాలని చాలా మందే అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+