సోనియా గాంధీపై తలపడేందుకే వైయస్ జగన్ రెడీ

ఓ వైపు నియోజకవర్గాల్లో వైయస్ జయంతి సభల్లో పాల్గొనాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందని, మరో వైపు హైదరాబాదులో ఈ నెల 8వ తేదీన సాయంత్రం దాకా సభలు ఏర్పాటు చేసి కట్టడి చేస్తూ వీలుంటే జిల్లాలకు వెళ్లవచ్చునని చెబుతున్నారని, దీంతో శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సాక్షి వార్తా కథనం సారాంశం. ముఖ్యమంత్రి రోశయ్య పేరు గానీ అధిష్టానం ప్రస్తావన గానీ లేకుండానే ఈ విధమైన వార్తాకథనాన్ని సాక్షి ప్రచురించింది. ఈ నెల 8వ తేదీన ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అసెంబ్లీ సమావేశం ఉందని, సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో అధికారికంగా వైయస్ జయంతి సభ నిర్వహిస్తున్నారని, ఇలా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు జిల్లాల్లో జరిగే వైయస్ జయంతి సభల్లో పాల్గొనకుండా కట్టడి చేశారని వార్తాకథనం వివరించింది. వైయస్ జయంతి కార్యక్రమాల్లో ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడి, రాజధానిలో ఏర్పాటైన కార్యక్రమాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని సాక్షి వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications