వరంగల్ లో ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి అరెస్టు

గురువారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా హన్మకొండ సాయిబాబా గుడిలో చీరెలు పంచారు. వరంగల్ పశ్చిమ స్థానానికి ఉప ఎన్నికలున్న కారణంగా చీరెలు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఆమెపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
నామినేషన్లకు ముందే కాంగ్రెసు ఓటర్లను ప్రలోభ పెట్టడం ప్రారంభించిందని ఆరోపించింది. ఆమెపై పోలీసుల సూమోటాగా కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమెకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.












Click it and Unblock the Notifications