ఎమ్మెల్యేలను రాకుండా చేస్తున్నారని జగన్ ఆరోపణ

ఇది ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ పుట్టిన రోజుకూడా ఏ ఒక్క ఎమ్మెల్యేనూ నియోజకవర్గాల్లోకి వెళ్లకుండా చేశారని జగన్ అన్నారు. రాజశేఖర్ రెడ్డికోసం చనిపోయినవారు కాంగ్రెస్ కార్యకర్తలు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఎంతో మంది ఎమ్మెలు ఓదార్పుయాత్రకు రావాలని ఉన్నా రాలేక పోతున్నారని జగన్ అన్నారు. దీంతో తన గుండె బురువెక్కిందని, తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలకు తానంటే ప్రాణమని, వారిని కూడా రాకుండా అడ్డుకున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications