జగన్ కు అందివస్తున్న అవకాశం, ఓదార్పు యాత్ర సక్సెస్

జగన్ ఓదార్పు యాత్రలో నేతలు సరికొత్త వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. ఈ ఓదార్పు యాత్ర కోసం వైఎస్ జగన్ సకాలంలో ఈ జిల్లాకు వచ్చినప్పటికీ నాయకులు కావాలనే ఈ యాత్రను ఆలస్యంగా ప్రారంభించారు. అలా మూడు గంటల ఆలస్యంతో ప్రారంభమైన ఈ యాత్ర తొలి రోజు ముగిసే సరికి 12 గంటల ఆలస్యంతో వుంది. రెండో రోజు శుక్రవారం కూడా అదే తీరులో కొనసాగుతోంది. నిర్ణీత సమయం కన్నా ఆరు గంటల ఆలస్యంగా జరుగుతోంది.
జగన్ ఓదార్పు యాత్ర రెండో రోజు స్ధానికేతర నేతల హవా ప్రముఖంగా కన్పించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకష్ణ తన అనుచరులతోసహా 200 వాహనాల వరకు జగన్ కాన్వాయ్‌లో ఏర్పాటు చేయించారు. వీరితోపాటు రాయచోటి ఎంఎల్ఏ జి.శ్రీకాంత్‌రెడ్డి, ఏలూరు ఎంఎల్ఏ ఆళ్ల నాని తదితరులు తమతమ బలగాలను తీసుకొచ్చారు. స్ధానిక ప్రజలతో వీరు కలిసిపోవడంతో జగన్ అడుగుపెట్టిన చోటల్లా వేలాది మంది కన్పించేలా ఈ నాయకులు తమ ప్రయత్నాలు కొనసాగించారు.












Click it and Unblock the Notifications