గుంటూరు: శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ నుండి తిరుపతికి బయలుదేరిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో శనివారం తెల్లవారు జామున బాపట్ల దాటిన తర్వాత అప్పికట్ల సమీపంలో ఒక నిర్జీవ ప్రదేశంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు నాలుగు బోగీలలో ప్రయాణికుల వద్ద నుండి నగలు, నగదును అపహరించి, చైను లాగి, రైలు ఆగగానే పారిపోయారు. తిరుపతి స్టేషన్‌లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.