హైదరాబాద్ : కుల ప్రాతిపదికనే జనాభా గణన చేపట్టాలని, చేసేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలను పైకి తెచ్చింది తెలుగు దేశం పార్టీయేనని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చిపోయాయని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నయంగా ఒక్క టీడీపీ మాత్రమే నిలబడగలిగిందని బాబు వ్యాఖ్యానించారు. బీసీ విద్యార్థులకు ఉపకారవేతనాల బకాయిలు చెల్లించేవరకు అసెంబ్లీ వేదికగా సర్కారును నిలదీస్తామని స్ఫష్టం చేశారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు టీడీపీ పోరాటం చేస్తుందని బాబు చెప్పారు.