నా తండ్రి మీద అభిమానంతో జనం నన్ను ఓదార్చుతున్నారు: జగన్

YS Jagan
పొందూరు: తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి కోసం ప్రాణాలు వదిలిన వారిని ఓదార్చడానికి తానొస్తే తనకే ఓదార్పునిస్తున్నారని కడప ఎంపీ వైయస్ జగన్‌ అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పొందూరు పాత బస్టాండ్‌ సెంటర్‌లో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జనహృదయ నేత వైయస్ ఆర్‌ ప్రతి గుండె చప్పుడులో ఉన్నారు కాబట్టే ఓదార్పుయాత్ర గంటల తరబడి ఆలస్యమయినా ప్రజలు తన కోసం వేచి చూస్తున్నారని ఆయన అన్నారు.

మరోవైపు తమ అభిమాన నేతను చూసేందుకు తరలివచ్చిన జనంతో పొందూరు పాత బస్టాండ్‌ సెంటర్‌ జనసంద్రంగా మారింది. ఈ మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్న యువనేతకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. అభిమానులందరికీ అభివాదం చేస్తూ యువనేత ముందుకు సాగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+