బొద్దాం: ఓదార్పు యాత్రలో భాగంగా కడప ఎంపీ వైయస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బొద్దాం చేరుకున్నారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జగన్ వారందరికీ అభివాదం చేసుకుంటూ, ఆటోగ్రాఫ్‌లిస్తూ ముందుకు కదిలారు. అంతకుముందు ముషిణివలసలోవైయస్ ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. పెడ్యూల్‌లో లేనప్పటికీ అభిమానులు కోరిక మేరకు కేశవపల్లిలోనూ జగన్ పర్యటించారు.