వైయస్ అల్లుడిపై ఆరోపణలు: మైనింగ్ పై అసెంబ్లీలో దుమారం

అసెంబ్లీలో ఈరోజు ఖమ్మం జిల్లా బయ్యారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని సీపీఐ సభ్యుడు సాంబశివరావు ఆరోపించారు. దాదాపు లక్షా 50 వేల ఎకరాల్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని వై.ఎస్.అల్లుడు అనిల్‌కుమార్ పేరిట పనిచేస్తున్న రక్షణ స్టీల్‌కు ధారాదత్తం చేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. గిరిజన చట్టాలకు విరుద్దంగా ఈ అక్రమ మైనింగ్ సాగిందని అన్నారు. దేశం మొత్తంలో ఇవి ఖరీదైన గనులని అన్నారు. దీనిపై మంత్రి బాలినేని సమాధానం ఇస్తూ అక్కడ అంతా సక్రమమేనని, ఆ లీజు అనిల్ కుమార్ కు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సాక్ష్యాలు ఉంటే చూపితే చర్యలు తీసుకుంటామన్నారు. రక్షణ స్టీల్ సరఫరా మాత్రమే చేస్తుందని ఆయన చెప్పారు. గార్లలో కడప మేయర్, వైయస్ బావ మరిది రవీంద్రనాథ్ రెడ్డికి మైనింగ్ కట్టబెట్టారని సాంబశివ రావు ఆరోపించారు.












Click it and Unblock the Notifications