వైయస్ జగన్ ను ఢీకొట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ

వైయస్ జగన్ కుటుంబ వారసుడు మాత్రమేనని, తాము వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసులమని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తామంతా వారసులమేనని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల కాస్తా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, ఆ ఇబ్బంది త్వరలోనే సమసిపోతుందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు గానీ, కాంగ్రెసు ప్రభుత్వానికి గానీ ఏ విధమైన ఢోకా లేదని ఆయన దీమా వ్యక్తం చేశారు. తాము జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామని, అయితే అధిష్టానం రోశయ్యను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించిందని, జగనే స్వయంగా రోశయ్య పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారని, దాంతో తాము రోశయ్యకు మద్దతు తెలిపామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications