వైయస్ జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన హైకమాండ్?

జగన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని, రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీస్తున్నామని మొయిలీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయంపై ఎవరూ మాట్లాడడం లేదు. జగన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయంపై రాష్ట్ర కాంగ్రెసు కార్యాలయం గాంధీభవన్ కు ఏ విధమైన సమాచారం అందలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై జగన్ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications