వైయస్ జగన్ వెంట కెవిపి రామచందర్ రావు ఉంటారా?

KVP Ramachandar Rao
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి రోశయ్యపై ప్రత్యక్ష పోరుకు సిద్ధపడిన నేపథ్యంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కెవిపి ఎటు ఉంటారనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్య మాత్రం కెవిపిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెవిపి రామచందర్ రావు తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి భిన్నంగా నడిచే వ్యక్తి కాదని, జగన్ ను దారిలోకి తేవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. నిజానికి, జగన్ కు కెవిపి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని, అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా వెళ్లకూడదని సూచించారని అంటున్నారు. అయితే జగన్ ఆయన మాట వినడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.

జగన్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అనే పద్ధతిలో వ్యవహరించడం పట్ల కెవిపి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు చెబుతున్నారు. జగన్ వ్యవహారంలో ఆయన పూర్తిగా చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వెళ్లడం పల్ల తలెత్తే పరిణామాల పట్ల ఆయన మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. వైయస్ పై ఉన్న ప్రేమ కొద్దీ, వైయస్ వెళ్లగానే ఆయన కుటుంబాన్ని వదిలేశారనే అపవాదు రాకుండా చూసుకోవడానికి ఆయన ఇంత కాలం జగన్ కు ఒక కవచంగా ఉండే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ కు ఆయన దూరంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+