వైయస్ ఆస్తులపై విచారణ జరిపాలి: కాంగ్రెసు ఎమ్మెల్యే శంకర రావు

వైఎస్‌ఆర్ అధిష్ఠానానికి విధేయుడిగా ఉండబట్టే పార్టీలో కీలకపదవులు పొందగలిగారని, అధిష్టానం వైయస్ ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిందని ఆయన అన్నారు. జగన్ కూడా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి లక్షణాలను అలవర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి కడప దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న తనపై జగన్ వర్గీయులు దాడికి దిగారని ఆయన ఆరోపించారు. పోలీసులు సైతం పట్టించుకోకపోవడం జగన్ కుట్రలో భాగమేనని మండిపడ్డారు.పదవులు త్యాగం చేసిన సోనియా, రాహుల్‌ను జగన్ ఆదర్శంగా తీసుకోవాని సూచించారు.












Click it and Unblock the Notifications