వైయస్ జగన్ సముద్రంలో నీటి బొట్టు మాత్రమే: సర్వే సత్యనారాయణ

పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ మంచి భవిష్యత్తును సాధించుకోవడానికి వీలుందని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవడం వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడయ్యారని ఆయన అన్నారు. అధిష్టానం రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశం రాజశేఖర రెడ్డికి లభించిందని ఆయన అన్నారు. జగన్ వార్తలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన రుసరుసలాడారు. తెల్లారి లేవగానే టీవీ చానెళ్లు జగన్ వార్తలనే ప్రసారం చేస్తున్నాయని, జగన్ కు అనవసరమైన ప్రాధాన్యం ఇస్తున్నాయని, రాష్ట్రంలో మరే విషయాలు లేనట్లు జగన్ గురించి వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications