బయ్యారం మైన్స్ అక్రమాలపై అసెంబ్లీలో దుమారం

ప్రతిపక్షాలు గొడవ చేస్తున్న సమయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఎదురు దాడికి దిగారు. ఈ అంశంపై పలు మార్లు శాసనసభలో చర్చించామని ఆయన చెప్పారు. బయ్యారం గనుల వ్యవహారంపై నిన్ననే చర్చించామని, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సమాధానం కూడా ఇచ్చారని, దానిపై మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గనుల లీజు విషయంలో విధాన నిర్ణయాల్లో లోపాలు లేవని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications