హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులతో మంతనాలు : కెవిపి రామచందర్ రావు వ్యూహం ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియసఖుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు వ్యూహం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన మంగళవారం శాసనసభలో మంత్రులతో మంతనాలు జరపడం వెనక దాగి ఉన్న రహస్యమేమిటనేది తెలియడం లేదు. వైయస్ జగన్ ను కెవిపి వదులుకుంటారా, ఆయనను దారిలోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తారా అనేది తేలడం లేదు. కెవిపి మాటను కూడా జగన్ ఖాతరు చేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే, జగన్ ఎక్కువ నష్టం జరగకుండా చూడడమే ఆయన ముందున్న కర్తవ్యంగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే కెవిపి మంత్రులతో మంతనాలు జరిపినట్లు భావిస్తున్నారు.

కాగా, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ జగన్ వ్యవహారంపై కెవిపి రామచందర్ రావుతోనూ, జగన్ తల్లి విజయలక్ష్మితోనూ ఫోనులో మాట్లాడినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య చేసిన తీవ్ర వ్యాఖ్యలను ప్రస్తావించి ఘాటును తగ్గించాలని జగన్ ను చెప్పాలని ఆయన సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో తన మాటల్లో వాడిని జగన్ తగ్గించినట్లు చెబుతున్నారు. అయితే, జగన్ మాటల్లో వాడి తగ్గినప్పటికీ ధిక్కార స్వరం మారలేదు. ఎవరున్నా, లేకున్నా తాను ముందుకు సాగుతానని ఆయన చెప్పారు. శాసనసభ్యులు తన ఓదార్పు యాత్రకు రాకపోవడంపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X