వైయస్ జగన్ పై హైకమాండ్ బాణం గురి తప్పిందా?

అంబటి రాంబాబుపై వేసిన సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంబటి రాంబాబును సస్పెండ్ చేయడం చారిత్రాత్మక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తమ రాష్ట్రానికి చెందిన యువ శాసనసభ్యులతో సమావేశం కావడంలో తప్పు లేదని, రాహుల్ గాంధీయే తమ నాయకుడని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు దిశానిర్దేశం చేసేది జగనే అని ఆయన అన్నారు. జగన్ యాత్ర వ్యక్తిగతమైనా కాంగ్రెసుకు లాభం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య మనుషులు జగన్ యాత్రకు ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ వ్యతిరేక శక్తులు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆషాఢభూతుల మాటలను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications