తెలంగాణ కోసం చంద్రబాబుతో విభేదించా: నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ కోసం తాను తమ పార్టీ అధినేత చంద్రబాబుతో విభేదించానని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి చెప్పుకున్నారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందుకు రాకపోవడంతో తాను పార్టీ మహానాడుకు వెళ్లలేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పోటీ పట్టవద్దని వాదించిన తాను తెలంగాణలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారానికి వెళ్లడానికి కూడా నిరాకరించానని ఆయన చెప్పారు.

తెలంగాణ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మనసావాచాకర్మణా తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. పదవులపై తనకు వ్యామోహం లేదని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దాన్ని చూసి తెలంగాణ కోసం తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+