వరదల బీభత్సంతో జలదిగ్బంధంలో పలు గ్రామాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల, కాగజ్ నగర్, నిర్మల్, బెల్లంపల్లి తదితర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వేమనపల్లి మండలంలో గొర్లపల్లి, బతుకమ్మ వాగులు పొంగిపొర్లుతున్నాయి. 25 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ఉద్ధృతికి బతుకమ్మవాగు కాజ్ వే కొట్టుకుపోయింది. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. బెజ్జూరు మండలంలో కృష్ణపల్లి వాగు పొంగి 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.












Click it and Unblock the Notifications