చంద్రబాబు ఆశలన్నీ వైయస్ జగన్ పైనే

కాంగ్రెసు పార్టీలోని పరిణామాలను క్షుణ్నంగా పరిశీలించాలని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆయన ముఖ్య నాయకులకు సూచించారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాలని ఆయన చెప్పారు. బాబ్లీపై పోరాటాన్ని ఉధృతం చేయడం, ప్రజాసమస్యలపై పార్టీ కమిటీలు వేయడం, తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమాలపై పోరాటం చేయడం మధ్యంతర ఎన్నికలు వస్తాయనే ఉద్దేశంతోనేనని అంటున్నారు. అంతేకాకుండా, త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అన్నింటి కన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, దాని వల్ల మధ్యంతర ఎన్నికలు రావచ్చునని ఆయన ఊహిస్తున్నారు. అందుకే ప్రజాపోరాటాలకు చంద్రబాబు శ్రీకారం చూట్టారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications