చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అపాయింట్ మెంటు దొరకలేదు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రోశయ్య శనివారం చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కరుణానిధిని కలవడానికి ప్రయత్నించారు. అయితే కరుణానిధి అందుకు నిరాకరించారు. రోశయ్య వద్దకు కరుణానిధి జిల్లా కలెక్టర్ ను పంపారు.
కాంచీపురంలోని అమరావతి దేవాలయానికి చెందిన 497 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని రోశయ్య తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై కొద్ది రోజుల్లో తమిళనాడు ప్రభుత్వం తన స్పందనను తెలియజేస్తుందని ఆయన చెప్పారు.