నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామంలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మోహన్, సుమలత అనే ప్రేమికులు విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది వారు ఈ దారుణానికి ఒడిగట్టారు.
సుమలతకు వేరే వ్యక్తితో పెద్దలు పెళ్లి నిశ్చియం చేశారు. నిశ్చితార్థం జరిగిన మర్నాడే సుమలత తన ప్రియుడితో ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.