హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే వివిధ వివాదాల్లో ఇరుక్కుని బయటపడుతున్న సమయంలో ఈ వివాదం ముందుకు రావడం తలనొప్పిగానే మారింది. ఖలేజా టైటిల్ తమదని దర్శకుడు సుబ్బారెడ్డి చెప్పారు. నిర్మాత విజయభాస్కర్ ఆ టైటిల్ ను రిజిస్టర్ చేశారని ఆయన చెప్పారు. వీరిద్దరు కలిసి గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొని ఖలేజా టైటిల్ తమదని చెప్పుకున్నారు.
తాము ఫిల్స్ ఛేంబర్ లో ఫిర్యాదు చేసినట్లు విజయభాస్కర్ చెప్పారు. తమకు న్యాయం చేయాలని సుబ్బారెడ్డి కోరారు. తమకు న్యాయం జరగకపోతే పోరాటం చేస్తామని, ఫిల్మ్ ఛేంబర్ వద్ద దీక్ష చేస్తామని ఆయన చెప్పారు.