వైయస్ అల్లుడి గనులపై పోరు: సిపిఐ నేత నారాయణ అరెస్టు

గనుల అక్రమాలను అడ్డుకోకపతే రాష్ట్రంలో మైనింగ్ మాఫియా రాజ్యమేలే ప్రమాదముందని నారాయణ అంతకు ముందు అన్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు వంతెన వద్ద వర్షంలో సైతం నారయణ, పువ్వాడ తదితర నేతలు భైఠాయించి బయ్యారం గనుల అక్రమాలపై నిరసన తెలియజేశారు. గనుల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఒక తీరుగా, కర్ణాటకలో మరో తీరుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బయ్యారంలో ఇనుప ఖనిజాన్ని ప్రభుత్వమే వెలికితీసి, పరిశ్రమ స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూగర్భ సంపదను కొందరు కాంగ్రెస్ ఎంపీలు, కిందిస్థాయి నాయకులు దోచుకుంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications