ఆ పిలగాడు ఎందుకలా చేస్తున్నాడు: జగన్ పై సోనియా వ్యాఖ్య

కాంగ్రెసు పార్టీకి నష్టం కలగకుండా, తెలుగుదేశం పార్టీ లాభం జరగకుండా ఓదార్పు యాత్ర ఉండాలని ప్రకాశం జిల్లా శాసనసభ్యులు చేసిన సూచనను జగన్ తిరస్కరించడంపై సోనియా తీవ్రంగా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. తాము ఓదార్పు యాత్రకు వెళ్లబోమని పార్లమెంటు సభ్యులు సోనియాతో చెప్పారు. ఇంతకు ముందు జగన్ కు విధేయతను ప్రదర్శించిన కిళ్లి కృపారాణి కూడా తన మనసు మార్చుకున్నారు. ఇంతకు ముందు కిళ్లి కృపారాణి జగన్ ఓదార్పు యాత్రకు కుటుంబ సభ్యులను పంపడంపై సోనియా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పొన్నం ప్రభాకర్, జి. వివేక్, రాజయ్య, రాయపాటి సాంబశివ రావు సోనియాను కలిసి తాము జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లబోమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications