వైయస్ ఆత్మను డిఎల్, జెసి పీక్కు తింటున్నారు: అంబటి రాంబాబు

వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని ధ్వంసం చేసేందుకు వారిద్దరు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాయలసీమలో పులులు, సింహాలు పుడుతాయంటారని, అయితే ఈ రెండు నక్కలు పుట్టాయని ఆయన అన్నారు. అయితే రాంబాబు డిఎల్, జెసిల పేర్లు ప్రస్తావించలేదు. టిటిడి అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని, తిరుమల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications