వైయస్ జగన్ ఓదార్పు: చక్రం తిప్పుతున్న వైవి సుబ్బారెడ్డి

గతంలో పార్టీ టికెట్లను ఆశించి భంగపడిన వారిని చేరువ చేసుకునే యత్నాలను సుబ్బారెడ్డి వేగంచేశారు. ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యేలు పాల్గొనేలా చేయడం ద్వారా అధిష్ఠానం వద్ద తన సత్తా ఏమిటో చాటాలనే ప్రయత్నాన్ని జగన్ వర్గం చేస్తోందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం సూచనను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరస్కరించడం కూడా వ్యూహంలో భాగమని అంటున్నారు. ఓదార్పులో పాల్గొనవద్దనే అధిష్ఠానం అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా తనకు పదవులు శాశ్వతం కాదని, ఓదార్పే ముఖ్యమని బాలినేని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలోకి రావాలనేది జగన్ వర్గం వ్యూహం. ఈ వారంలో వ్యూహాలకు మరింత పదునుపెట్టి, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఓదార్పులో పాల్గొనేలా చేసే యత్నాల్లో జగన్ వర్గం ఉంది.












Click it and Unblock the Notifications