హై కమాండ్ కు సవాల్: రెచ్చగొడుతున్న జగన్ వర్గం

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం జిల్లాల్లో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఓదార్పు యాత్రకు శాసనసభ్యులు దూరంగా ఉండాలని చూస్తే వారిని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది. శాసనసభ్యులపై ఓ వైపు ఒత్తిడి తెస్తూ వినకపోతే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని రెచ్చగొడుతోంది. ఓదార్పు యాత్రపై పార్టీ అధిష్టానం పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్న కొద్దీ మరింత వ్యూహాత్మకంగా, దూకుడుగా జగన్ వర్గం ముందుకు సాగుతోంది. అధిష్టానం వద్దన్నా ఓదార్పు యాత్రను జనం కోరుకుంటున్నారని చెప్పే యత్నాలు చేస్తోంది. ఆ మేరకు శాసనసభ్యులపై కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానిక నాయకుల ద్వారా ఒత్తిడి తెస్తోంది. ఇతర నాయకులను తెరపైకి తెస్తూ ఎమ్మెల్యేలను బెదిరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని 8 మంది ఎమ్మెల్యేలు, ఆ జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం స్పష్టంగా చెప్పింది. అంతకుముందు ఆ జిల్లాలో ఒకరిద్దరు మినహా అందరూ ఓదార్పులో పాల్గొంటారని జగన్‌ వర్గం భావించింది.

చివరకు అధిష్ఠానం జోక్యంతో ఇద్దరు మాత్రం పాల్గొనే అవకాశం ఉండటంతో జగన్‌ వర్గం కొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. జగన్‌కు పూర్తి మద్దతుగా ఉంటారని భావించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అధిష్ఠానం మాటకు తలొగ్గడంతో జగన్‌ వర్గం ఆయనపై ద్విముఖ వ్యూహాన్ని ప్రయోగించింది. ఆ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యే పాల్గొనాలని ఒత్తిడి తెచ్చారు. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి మధుసూదనరావు జగన్‌ ఓదార్పు యాత్రలో పాల్గొంటానని అన్నారు. ఈ అంశం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని పునరాలోచనలో పడేసింది. ఓదార్పుయాత్రలో తాను పాల్గొనే అంశంపై ఈ నెల 24న ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో అనుసరించిన ఈ వ్యూహాన్ని అంతటా ప్రయోగించేందుకు జగన్ వర్గం సిద్ధపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+