బలం ఉంటే వైయస్ జగన్ రోశయ్యను దించేసేవారే?

YS Jagan
హైదరాబాద్: తగిన శాసనసభ్యుల బలం ఉంటే కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చేసి ఉండేవారనే మాట వినిపిస్తోంది. కనీసం 40, 50 మంది శాసనసభ్యుల మద్దతు ఉన్నా జగన్ ఆ పనికి పూనుకుని ఉండేవారని ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుత తరుణంలో జగన్ వెంట వెళ్లేందుకు ఎక్కువ మంది కాంగ్రెసు శాసనసభ్యులు ఇష్టపడడం లేదని అంటున్నారు. శాసనసభ్యుల మద్దతు కోసమే ఓదార్పు యాత్రలోనూ జగన్ తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నారు. ఎన్నికల్లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆర్థిక అండదండలు అందించడం వల్ల చాలా మంది విజయం సాధించారు. దాన్ని సాకుగా చేసుకుని జగన్ శాసనసభ్యులపై ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. శాసనసభ్యులు ముందుకు రాకపోతే ప్రతి నియోజక వర్గంలోనూ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో శాసనసభ్యులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.

వైయస్ జగన్ మద్దతిచ్చే శాసనసభ్యుల సంఖ్య రెండు పదులు కూడా దాటనే అంచనాకు పార్టీ అధిష్టానం వచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వం పడిపోయినా సరే, జగన్ ను కట్టడి చేయడానికే నిర్ణయించుకుంది. మరో నాలుగేళ్ల పదవీకాలం ఉండడంతో శాసనసభ్యులు తిరిగి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఇది కూడా జగన్ కు మైనస్ పాయింటుగానే మారింది. దీంతో వచ్చే ఎన్నికల వరకు వైయస్ మరణం వల్ల వెల్లువెత్తిన సానుభూతిని కాపాడుకోవడం జగన్ కు కష్టంగానే ఉంది. దాంతో ఓదార్పు యాత్ర పేరుతో జిల్లాల యాత్రలను సాధ్యమైనంత ఎక్కువ కాలం సాగించాలనే ఉద్దేశంతో జగన్ వర్గం ఉన్నట్లు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు పార్టీలో పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచన చేయవచ్చునని అనుకుంటోంది. పార్టీ పెట్టే విషయం కూడా ఆ సమయంలోనే ముందుకు వస్తుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+