నా బాధ్యత మరింత పెరిగింది: ఇండియన్ ఐడల్ శ్రీరామ్

Sreeram Chandra
హైదరాబాద్: ఇండియన్ ఐడల్ గా విజయం సాధించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని శ్రీరామ్ అన్నారు. ఆయన శుక్రవారం సాయంత్రం హైదరాబాదు వచ్చారు. శనివారమంతా ఆయన హైదరాబాదులో హల్ చల్ చేశారు. తాను చదువుకున్న సికింద్రాబాదులోని ఆండ్రూస్ పాఠశాలను సందర్శించి విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించారు. పాటలు పాడి పిల్లలను అలరించారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను, గవర్నర్ నరసింహన్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తాను పాఠశాల విద్య అభ్యసిస్తున్న కాలంలో లతా మంగేష్కర్ పాడిన వందే మాతరం గీతం పాడుతూ ఉండేవాడినని, తొలిసారి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇచ్చానని ఆయన చెప్పారు.

ఇండియన్ ఐడల్ లో విజయం సాధిస్తానని అనుకోలేదని, విజయాన్ని తాను అద్భుతంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. తన విజయంలో మీడియా ప్రధాన పాత్ర పోషించిందని ఆయన చెప్పారు. తన అసలు ప్రయాణం ఇప్పుడే ప్రారంభవుతుందని ఆయన అన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చునని అర్థమైందని ఆయన అన్నారు. తనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల్లో కూడా అభిమానులున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+