కెవిపి రామచందర్ రావుకు రోశయ్య భయపడుతున్నారు: ఎర్రంనాయుడు

Yerran Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య ఉత్తర కుమారుడని, రాష్ట్ర పాలన రోశయ్య చేతిలో లేదని తెలుగుదేశం పార్టీ నాయుకుడు కె. ఎర్రంనాయుడు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యాలయం ఢిల్లీ నుంచే నడుస్తున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రోశయ్యది పూర్తి అమర్థ పాలన అని ఆయన విమర్శించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ పై చర్యలు తీసుకుంటే ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావుకు రోశయ్య భయపడుతున్నట్లున్నారని ఆయన అన్నారు. విజిలెన్స్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కూడా రోశయ్య చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంపై న్యాయ విచారణ గానీ సిబిఐ విచారణ గానీ ఎందుకు జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. రోశయ్య ప్రభుత్వం గుండు సున్నా అని, ప్రభుత్వ పాలనా యంత్రాంగం కుప్పకూలుతోందని ఆయన అన్నారు. గిరిజనులపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రేమ ఒలకబోస్తున్నారని, వారిపై ప్రేమ ఉంటే జిందాల్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడకం దార్లలో మంత్రులు, శాసనసభ్యులు కూడా ఉండవచ్చునని ఆయన అన్నారు. దీనిపై విచారణ వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+