హైదరాబాద్:
తనకు
డ్రగ్
మాఫియాతో
సంబంధాలున్నట్లు
వచ్చిన
వార్తలపై
హీరోయిన్
త్రిష
తీవ్రంగా
మండిపడుతున్నారు.
ప్రస్తుతం
కొడైకెనాల్
లో
ఓ
సినిమా
షూటింగ్
లో
ఉన్న
ఆమె
ఆదివారం
ఉదయం
ఓ
తెలుగు
టీవీ
చానెల్
ప్రతినిధితో
మాట్లాడారు.
డ్రగ్
మాఫియాకు
సంబంధించిన
వార్తల్లో
తన
పేరును
పదే
పదే
ఎందుకు
ఫ్లాష్
చేస్తున్నారో
అర్థం
కావడం
లేదని
ఆమె
అన్నారు.
డ్రగ్స్
తో
హైదరాబాదులో
పట్టుబడిన
వారితో
తాను
ఎప్పుడూ
మాట్లాడలేదని
ఆమె
స్పష్టం
చేశారు.
తప్పుడు
వార్తలు
రాస్తూ
ప్రచారం
చేస్తున్నవారిని
ఇంతటితో
వదలనని
ఆమె
అన్నారు.
న్యాయవాదితో
మాట్లాడుతున్నట్లు
ఆమె
తెలిపారు.
తన
ఇమేజ్
ను
దెబ్బ
తీయడానికి
ప్రయత్నించినవారిని
ఎట్టి
పరిస్థితిలోనూ
వదలబోనని,
తన
వ్యక్తిత్వాన్ని
దెబ్బ
తీయడానికే
తప్పుడు
వార్తలు
ప్రసారం
చేస్తున్నారని
ఆమె
అన్నారు.
తాను
వారితో
ఎప్పుడూ
మాట్లాలేదని,
ఇంతకన్నా
ఎక్కువ
చెప్పలేనని
ఆమె
అన్నారు.
సెలిబ్రిటీగా
తన
ఇమేజ్
ను
దెబ్బ
తీయడానికి
జరిగిన
ప్రయత్నాన్ని
సహించబోనని
ఆమె
అన్నారు.