హైకమాండ్ దోబుచులాట: తిప్పి కొట్టిన వైయస్ జగన్

ఒక రకంగా జగన్ కు చివరి అవకాశం ఇచ్చేందుకు వైయస్ మరణానంతరం చనిపోయినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, తాము ఆర్థిక సాయం అందించాలని ముందుకు వచ్చినా జగన్ వినడం లేదని, అధికారంపై మక్కువ ఉంది కాబట్టే జగన్ అలా చేస్తున్నారని చెప్పడానికి అధిష్టానం ఒక ఎత్తుగడగానే వ్యవహరించిందని అనుకోవాలి. అధిష్టానం ఎత్తుగడను తిప్పికొట్టడానికి జగన్ ప్రకటన చేశారని భావిస్తున్నారు. పార్టీ నాయకుల నుంచి, మంత్రుల నుంచి సలహాలు వచ్చినా ఆయన వినడం లేదు. పైగా, పార్టీ శాసనసభ్యులను, నాయకులను, పార్లమెంటు సభ్యులను తన వెంట పంపించాలనే డిమాండ్ ను ప్రకటన ద్వారా పెట్టినట్లు భావిస్తున్నారు. ఇది మరింతగా జగన్ వ్యవహార శైలిని, ఉద్దేశ్యాన్ని బయటపెడుతోందని భావిస్తున్నారు. ఆయన ధిక్కారానికి అనవాలుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications