జగన్ ఫ్యాక్టర్: గడువు కన్నా ముందే తెలంగాణపై నిర్ణయం

గడువు కన్నా ముందే తెలంగాణపై గడువు కన్నా ముందే కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చుననే ప్రచారానికి జస్టిస్ శ్రీకృష్ణ ప్రకటన కూడా బలం చేకూరుస్తోంది. గడువు కన్నా ముందే తాము నివేదిక సమర్పిస్తామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆయన బుధవారం వరంగల్ జిల్లాలో పర్యటించి ప్రజాభిప్రాయం తీసుకున్నారు. గతంలో కూడా శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వికె దుగ్గల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. శ్రీకృష్ణ బుధవారం వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఆ విధమైన ఆర్థాన్నిచ్చి రాజ్ న్యూస్ వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications