వైయస్ జగన్ ప్రకటన: హైకమాండ్ కు ఎత్తిపొడుపులు

తన తండ్రి కోసం ప్రాణాలర్పించిన ఆత్మబంధువుల కుటుంబాలను వారి ఇంటికెళ్ళి పలకరించడం, ఆదుకోవడం కనీస ధర్మంగా భావించానని, ఇదే విషయాన్ని నల్లకాలువ వద్ద సభలో ప్రకటించానని ఆయన గుర్తు చేశారు. "కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్ళు తుడవడం, వారికి భరోసా ఇవ్వడం ముఖ్యం. అది మన సంప్రదాయం. దీన్ని అనుసరించే నేను ఓదార్పు యాత్ర ప్రారంభించాను. మధ్యలో కొందరు ఈ పవిత్ర కార్యక్రమాన్ని అవహేళన చేయడమే కాదు, మరణాలన్నీ అవాస్తవమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధినాయకత్వం నిర్ణయం ఓదార్పు ఆవశ్యకతను, అందులోని నిజాయితీని గుర్తించినట్లయింది" అని జగన్ తన ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు కూడా యాత్రలో తనతో పాటు వచ్చి, బాధిత కుటుంబాలతో పరిచయం ఏర్పరుచుకుని, సమస్యలు తెలుసుకుంటే వారికి ఇంకా మంచి చేయగలుగుతామని అన్నారు. దీనివల్ల మొత్తం కార్యక్రమానికి పరిపూర్ణత చేకూరుతుందని పేర్కొన్నారు. అది దివంగత నేతకు నిజమైన నివాళి అవుతుందని, తద్వారా పార్టీ శ్రేణుల్లో కూడా నూతనోత్తేజం నింపినట్లవుతుందని అన్నారు.












Click it and Unblock the Notifications