హెచ్ సిఎపై కన్ను: కెసిఆర్ కూతురు కవిత ఫుల్ స్వింగ్

శివలాల్ ఆధ్వర్యంలోని హెచ్‌సీఏతో తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి జరగడం లేదని, ఇక్కడి క్రికెటర్లకు అవకాశాలు దక్కడం లేదని తెరాస నేతలు ఎప్పట్నుంచో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ తెరాస నేత ఆధ్వర్యంలో తెలంగాణ క్రికెట్ సంఘాన్ని (టీసీఏ) కవిత నమోదు చేయించారు. ఈ సంఘానికి గుర్తింపు ఇవ్వాల్సిందిగా కోరుతూ కేంద్ర మంత్రి, ఐసీసీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ను, బీసీసీఐ ఉపాధ్యక్షుడు అరుణ్ జైట్లీని కవిత బృందం కలిసింది. టీసీఏకు గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కకాదని భావించిన కవిత నేరుగా హెచ్‌సీఏలోనే అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కొత్తగా క్లబ్బులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణలోని 119 నియోజయకవర్గాల నుంచి ఒక్కో క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయమై శాసనసభ్యులతో కవిత మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. క్రికెట్ అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ సహకారంతో ప్రతీ నియోజకవర్గంలో మైదానానికి కొంత స్థలం తీసుకోవాలని నిర్ణయించారు. స్థానిక శాసనసభ్యుడి సారథ్యంలో క్లబ్‌ను ఏర్పాటు చేసి హెచ్‌సీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని భావిస్తున్నారు. వాటికి గుర్తింపు సాధించడానికి అవసమైతే కోర్టును కూడా ఆశ్రయించాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications