వైయస్ కు లాస్ట్ చాన్స్: రేపు ఇడుపులపాయకు మొయిలీ

Veerappa Moily
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు నచ్చజెప్పేందుకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చివరి ప్రయత్నం చేయనున్నారు. పార్టీ అధిష్టానం దూతగా ఆయన వైయస్ జగన్ తో చర్చించే అవకాశం ఉంది. జగన్ తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా వైయస్ నివాళులు అర్పించే సందర్భాన్ని ఆయన వాడుకుంటున్నారు. దివంగత వైఎస్‌కు పుష్పాంజలి ఘటించేందుకు సెప్టెంబరు 2న వీరప్ప మొయిలీ పులివెందులకూ, ఇడుపులపాయకూ వస్తున్నారు. ఈ సందర్భంగా జగన్‌తో సమావేశమై చివరి ప్రయత్నంగా ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. అప్పటికీ పార్టీ దారిలోకి రాని పక్షంలో జరగబోయేదేమిటన్నది జగన్‌కు తెలుసునని మొయిలీ భావిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ మంగళవారం ఇక్కడ ప్రధానిని కలిసి పార్టీ విషయాలను నివేదించారు. పార్టీ అధ్యక్ష పదవికి సోనియా నామినేషన్‌ దాఖలుచేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజధానికి వచ్చిన డీఎస్‌ పార్టీకి చెందిన ఇతర నేతలను కూడా కలిశారు. ప్రస్తుతం జగన్‌తోపాటు రాష్ట్రంలోని కీలక నేతలతో కూడా మొయిలీ మాట్లాడుతున్నారు. చాలా మంది ఎంపీలు జగన్‌తో మాట్లాడుతున్నారని, ఆయనకు సలహా ఇచ్చేపనిలో ఉన్నారని మొయిలీ చెప్పారు. బుధవారం రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మన్మోహన్‌తో కలిసి మొయిలీ తిరుపతి వరకూ ప్రయాణిస్తారు. ఇదే అదనుగా ఆయన జగన్‌ విషయాన్ని ప్రధాని చెవిలో వేయనున్నట్లు సమాచారం. పార్టీ విషయాలను ప్రధానితో చర్చించే అవకాశం ఉందంటూ మొయిలీ రాష్ట్రనేతలకు సూచనప్రాయంగా తెలిపారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి పార్టీకి అందించిన సేవల గురించి అధిష్ఠానానికి స్పష్టంగా తెలుసునని, ఈ కారణంగానే ఆయనకు ఘనమైన రీతిలో నివాళి అర్పించేందుకు పార్టీ నిర్ణయించిందని మొయిలీ వ్యాఖ్యానించారు. వైఎస్‌ మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించడం కూడా దీనిలో భాగమేననని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+