నాయని నర్సింహారెడ్డి సహా తెలంగాణవ్యాప్తంగా అరెస్టులు

తెలంగాణ బంద్ పిలుపు నేపథ్యంలో మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, తెలంగాణవాదులను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ఆదివారం ఉదయం సంగారెడ్డిలో తెరాస మాజీ ఎమ్మెల్సీ రంగోల సత్యనారాయణ సహా పురపాలక సంఘం వైస్ ఛైర్మన్ మహ్మద్ జలాలుద్దీన్ బాబా, ఐకాస కన్వీనర్ అశోక్ కుమార్ ను తమ ఇళ్ల వద్దే పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పటాన్‌చెరులో ఐదుగురు నేతలను కూడా అరెస్టు చేశారు. తమ అరెస్టులపై తెరాస నేతలు మండిపడుతున్నారు.
వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ భారీగా అరెస్టులు జరిగాయి. పలు చోట్ల తెరాస నాయకులు, కార్యకర్తలు బస్సు డిపోల ఎదుట ధర్నాలకు దిగారు. మహబూబ్ నగర్ లో నలుగురిని అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసి బస్సులను నడిపించే ప్రయత్నం సాగుతోంది. గ్రూప్ -1 పరీక్షల కోసం హైదరాబాద్ లో 400 ప్రత్యేక సిటీ బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు తెలిపారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్, ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ప్రసాదరావు చెప్పారు. పోలీసు భద్రత మధ్య హైదరాబాద్‌లో సిటీ బస్సులు యథాతథంగా నడుస్తాయని ఆయన వెల్లడించారు. స్థానిక పోలీసుల సూచనల మేరకు జిల్లాలకు బస్ సర్వీసులను నడుపుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications