ఎపిపిఎఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి లీకు వీరుడు: కెసిఆర్

అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు, వెంకట్రామిరెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని అగౌరవ పరిచేలా రాష్ట్రపతి ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడంలేదని, ఎమ్మార్వోలను, ఎండీవోలను కూడా రాష్ట్రస్థాయి పోస్టులుగా మార్చారని., హైదరాబాద్ లో ఎమ్మార్వో పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ఆంధ్రవారిని తీసుకొచ్చిపెట్టారని ఆయన విమర్శించారు. మరి విశాఖపట్నం, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ పోస్టుల్లో తెలంగాణవారిని నియమిస్తారా" అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తామంటూ మొండిగా ప్రవర్తించి చతికిలపడిందని, పరీక్ష నిర్వహణలో విఫలమైందని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ విమర్శించారు. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల్లోపే ప్రశ్నపత్నం లీకైతే ఇక ఆ పరీక్షకు అర్థంలేదని ఆదివారం ఇక్కడ విలేఖరులతో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పరీక్షను వెంటనే రద్దు చేయాలని, లేదంటే మరో పోరాటం చేస్తామని కెసిఆర్ హెచ్చరించారు. బలవంతంగా పరీక్షను తెలంగాణపై రుద్దుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పునకు చెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. "న్యాయం చేయాలని అడిగితే ఏడుగురు తెలంగాణ ప్రాంత ఎంపీలను అరెస్టు చేశారు. రాష్ట్రమంత్రులు పరీక్ష వాయిదావేయాలని కోరినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. సహచర మంత్రుల మాటకు ముఖ్యమంత్రి విలువివ్వనప్పుడు వారు మంత్రులా లేక అటెండర్లా?" అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లు ఆంధ్ర ప్రాంతంవారని, తెలంగాణవారు వద్దన్నా పరీక్ష నిర్వహించడం ఆంధ్రప్రాంత జులుంకు నిదర్శనమన్నారు.
ఆదివారం జరిగిన పరీక్షపై న్యాయపరమైన పోరాటం చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణ న్యాయస్థానం ముందు నిలువదని, ఇలాంటి పరీక్ష నిర్వహించి ముఖ్యమంత్రి, డీజీపీ, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌లు ప్రపంచ రికార్డు సృష్టించారన్నారు. సోమవారం జరిగే తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస సమావేశంలో తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తే ఇంతకన్నా ఎక్కువ యుద్ధకాండ జరుగుతుందని హెచ్చరించారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications