సహనం కోల్పోతున్న కడప ఎంపి వైయస్ జగన్

కాగా, జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనంటూ బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటన చేశారు. తన మంత్రి పదవి పోయినా ఫరవాలేదని ఆయన అన్నారు. దీన్ని బట్టి ఏదో ఒక తీవ్రమైన కదుపు రావాలనే జగన్ ప్రయత్నం ఫలించడం లేదని తెలుస్తోంది. ఆ తీవ్రమైన కుదుపు కోసమే బాలినేని ఆ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం తనపై చర్య తీసుకుంటే జగన్ వర్గంలో ఊపు వస్తుందని బాలినేని భావించి ఉండవచ్చు. అందుకే అంత తీవ్రమైన ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. అధిష్టానంపై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించకుండా, అధికారం చేజిక్కించునే దిశగా సాగకుండా ఎంత కాలం ఇలా నెట్టుకుంటూ రావడమనే అసహనం కూడా జగన్ వర్గంలో పొడసూపి ఉంటుందని అంటున్నారు. అధిష్టానం చర్య తీసుకుంటే పూర్తి స్థాయిలో తిరుగుబాటు సమాయత్తం కావచ్చుననేది జగన్ వర్గం వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆ విధమైన ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications