తెలుగుదేశం...కొత్త స్కీమ్ 'పలకరింపు' ఉద్దేశ్యమిదే

పలకరింపు యాత్రకు సంబంధించి జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపించనున్న పోస్టర్లు, సీడీలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబుకు వెంకటసుబ్బన్న అందించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఈ యాత్రను టీడీపీ చేపట్టింది. పలకరింపునకు సంబంధించిన రూట్ మ్యాప్, షెడ్యూలు వివరాలను పార్టీ త్వరలో నిర్ణయింస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications