సిద్దిపేట: తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతూ ఈ నెల 17న సిద్దిపేట పాతబస్టాండ్ దీక్షా శిబిరం వద్ద 50 మంది క ళాకారులతో ఆట-పాట-మాట క ళా ప్రదర్శనతో తెలంగాణ ధూం...ధాం...కార్యక్రమం నిర్వహిస్తున్న ట్లు మయూరి జానపద కళాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మయూరి భా స్కర్ తెలిపారు. ఈమేరకు తెలంగాణ ధూం...ధాం...కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17న సాయంత్రం 4 గంటలకు ఆట-పాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ కళాకారుల జాక్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ధూం ధాం కార్యక్రమంలో బుర్రకథ, యక్షగానం, ఒగ్గు కథ, పల్లె సుద్దులు, జానపదుల కళారూపాల ద్వారా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి కళాకారులు మధుప్రియ, ఆకునూరి దేవయ్య, జడల రమేశ్, మిట్టపల్లి సురేందర్‌లు హాజరవుతారని చెప్పారు.